భారతదేశం, ఆగస్టు 19 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 19వ తేదీ ఎపిసోడ్ లో ఇది నా కథ అంటూ శ్రీధర్ కు చెప్తాడు కార్తీక్. కుటుంబం కోసం లండన్ నుంచి వచ్చా. కానీ అది ముక్కలైపోయింది. సరే అని జీవితంలో మళ్లీ ముందుకు వెళ్దామని అనుకునేలోపు.. అయినవాళ్లలో మాట పట్టింపులు వచ్చాయి. తల్లి, భార్య, కూతురుతో రోడ్డు మీదకు రావాల్సి వచ్చింది. మళ్లీ జీవితాన్ని మొదలెట్టా. నా ఆశ ఏంటీ? లక్ష్యం ఏంటీ అని ఆలోచించా. ఫ్యామిలీ సంతోషమే నా ఆశ. తల్లి, భార్య, కూతురు కోరికలు తీర్చడమే నా ఆశ అంటూ కార్తీక్ చెప్పాడు.

ఆ ఆశ తీర్చే రోజు అడుగు దూరంలో ఉంది. మీకు పరిచయం లేకపోవచ్చు. మా నాన్న పేరు కూడా శ్రీధరే. నాకున్న బెస్ట్ ఫ్రెండ్ అతను. ఆయన సిగరెట్ కాలుస్తారని, మందు తాగుతారని నాకు మాత్రమే తెలుసు. నేను లండన్ నుంచి వచ్చేటప్పుడు ఆయన కోసం లైటర్ కొన్నా. ఇప్పటికీ నా గుర్తుగా తన దగ్గర ప...