భారతదేశం, జనవరి 22 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 22 ఎపిసోడ్ లో నేను ఈ ఇంటి దేవతను అని పారిజాతం అంటుంది. అంటే నీ చుట్టూ తిరగాలా? నా కంటికి ఏదీ కనిపించడం లేదని శివ నారాయణ అంటాడు. కాంచన కోసం ఎదురు చూస్తుంటాడు శివ నారాయణ. కానీ కార్తీక్, దీప, శౌర్య మాత్రమే వస్తారు.

నానమ్మ ఏదీ అని శివ నారాయణ అడిగితే నానమ్మ రావడం లేదని శౌర్య చెప్తుంది. వదిన ఎందుకు రాలేదని సుమిత్ర అడుగుతుంది. అమ్మకు ధైర్యం సరిపోవడం లేదు. రమ్మని మీరు చెప్పారు, నేను చెప్పా. రాలేనని చెప్పిందని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న పరిస్థితి కూడా అలాగే ఉంది. అందుకే గదిలో నుంచి బయటకు రావడం లేదని పారు అంటే, నేను రప్పిస్తా కదా అని కార్తీక్ చెప్తాడు.

దీప మన ఇంట్లో ఈ రోజు విందు భోజనాలు ఏర్పాటు చేయ్. ఈ రోజు మన ఇంట్లో పండగ. నువ్వు నవ్వడమే పండగ సుమిత్ర అని దశరథ అంటాడు. అమ్మ నవ్వే పండగ నాన్న అన...