భారతదేశం, ఫిబ్రవరి 12 -- కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 12 ఎపిసోడ్ లో.. రెండోసారి కూడా శాంపిల్స్ మ్యాచ్ కావని ముందే నీకు అనిపించిందా? పారిజాతం. నీకు ఎందుకు అనుమానం వచ్చింది? అని కార్తీక్ అడుగుతాడు. ఇదే విషయాన్ని శివనారాయణ కూడా అడుగుతాడు. అత్తయ్యను ఏం అనకండి మామయ్య. ఇప్పుడు నా కూతురు నాతో ఉందన్న ధైర్యం వచ్చింది. బతుకు మీద ఆశ కలిగింది. నాకు ఏం కాదని సుమిత్ర ఆనందపడుతుంది.

నా కూతురి పెళ్లి చూస్తానన్న నమ్మకం ఉంది. జ్యోత్స్న నాకొక మాట ఇస్తావా? రోజు ఉదయం నువ్వే నన్ను నిద్ర లేపుతావా? ఉదయం నిద్ర లేవగానే ఎదురుగా ఉన్న అమ్మవారి ఫొటో చూసి దండం పెట్టుకుని మంచం దిగుతా. ఈ రోజు నుంచి నా కూతురే అమ్మవారు. ఉదయం లేవగానే నేను నీ ముఖం చూడాలని సుమిత్ర ఎమోషనల్ అవుతుంది.

స్వప్న లగేజీ సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్లిపొయేందుకు రెడీ అవుతుంది. ఒకప్పుడు కాశీ కావాలని ఇంట్ల...