భారతదేశం, నవంబర్ 10 -- కార్తీక దీపం 2 టుడే నవంబర్ 10 ఎపిసోడ్ లో దీప తెచ్చిన వంటలను టేబుల్ పై సెట్ చేస్తుంటారు కార్తీక్, దీప. అప్పుడే సుమిత్రను పారిజాతం తీసుకొస్తుంది. మాట్లాడాలని శివన్నారాయణను పక్కకు తీసుకెళ్తుంది పారు. కొత్త సీఈఓ ఎవరండి? అని పారు అడిగితే, ఆఫీస్ విషయాలు నీకెందుకు అని అంటాడు శివన్నారాయణ.

దీపను సీఈఓ చేయమని బోర్డు చెప్పిందా? అని పారిజాతం అడుగుతుంది. దీపను సీఈఓ చేస్తామని ఎవరు చెప్పారని శివన్నారాయణ అంటాడు. అందరితో పాటు తెలియాల్సింది నాకు కాస్త ముందు తెలిసిందని పారు అంటుంది. జ్యోత్స్న చెప్పింది కాబట్టే అడుగుతుందని కార్తీక్ అంటాడు. శివన్నారాయణ కూడా అదే అంటాడు. సుమిత్ర అడగాల్సింది కానీ పెద్దరికానికి గౌరవం ఇచ్చి ఆగిపోయిందని పారు అంటుంది.

దీపను సీఈఓ చేస్తానని నువ్వేమైనా చెప్పావా తాతా? అని కార్తీక్ అడుగుతాడు. చూడు పారు, తాత సీఈఓ చ...