భారతదేశం, డిసెంబర్ 22 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 22 ఎపిసోడ్ లో శ్రీధర్ అరెస్ట్ వీడియోను కాంచనకు పారిజాతం పంపిస్తుంది. ఈ వీడియో చూసి కాంచన కంగారు పడుతుంది. అప్పుడే పారు ఫోన్ చేసి నా భర్త పరువును రోడ్డుకు ఈడ్చారు కదా. అబద్దాలు చెప్పడం, మనుషులను మోసం చేయడం మీ ఇంట్లో వాళ్లందరికీ అలవాటే కదమ్మా. నువ్వు ఎదురుగా నిలబడ్డా ఇలాగే మాట్లాడతానని పారు అంటుంది.

నీ లాంటి ఒక కూతురిని కని నీ తండ్రి తప్పు చేశాడు. నువ్వేమో నీ అన్నకు మాటిచ్చి మోసం చేశావు. నీ కోడలేమో నా మనవరాలికి మాటిచ్చి మోసం చేసింది. నీ కొడుకేమో మేన కోడలిని పెళ్లి చేసుకోకుండా ఊర్లో ఎవరి ముందు తల ఎత్తుకోకుండా చేశాడు. ఇప్పుడేమో నీ భర్త మోసం చేశాడు. ఇప్పుడు చెప్పు శివ నారాయణకు కూతురు ఉండటం వల్ల కలిగిన ఆనందం ఏంటో చెప్పు? డబ్బు కోసం మరీ ఇంత దిగజారిపోతారని అనుకోలేదని కాంచనతో ఇష్టం వచ్చినట్లు ...