భారతదేశం, అక్టోబర్ 1 -- కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో శ్రీధర్ ఇచ్చిన డబ్బులను కార్తీక్ కు కనిపించకుండా దాచేస్తుంది కాంచన. ఈ సరుకులు మీ నాన్న తీసుకొచ్చారని కార్తీక్ కు అనసూయ చెప్తుంది. సరుకులు అవసరం లేదు. అవసరాలకు, బాధ్యతలకు తేడా తెలుసుకోవాలి. అవసరాలు తీర్చాల్సింది తండ్రే. కానీ ఈ ఇంటి బాధ్యత నాదేనని కార్తీక్ అంటాడు. డబ్బు ఇచ్చాడని తెలిస్తే ఎంత గొడవ జరుగుతుందోనని కాంచన అనుకుంటుంది.

ఈ సరుకులు కార్లో పెడితే నేను ఈ ఇంటికి మళ్లీ రాను. మీరు మా కోసం ఏమైనా చేయొచ్చు, కానీ మీ కోసం మేం ఏం చేయకూడదా? అవసరం లేదనుకుంటే కార్లో పెట్టించెయ్. కానీ ఓ తండ్రిగా కుమిలి కుమిలి ఏడుస్తా. మీ తాత ఇంట్లో డ్రైవర్ గా పని చేయడం నాకు ఇష్టం లేదు. ఇటు కొడుకు జీవితం, అటు కూతురి జీవితం అలాగే ఉంది. అల్లుడు, కొడుకు ఏం చేస్తున్నాడంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉ...