భారతదేశం, మే 24 -- కార్తీక దీపం 2: తెలుగు రాష్ట్రాల్లోని సీరియల్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తోంది కార్తీక దీపం 2. ఈ సీరియల్ రేటింగ్స్ లో టాప్ లేపుతూ, క్రేజ్ పరంగానూ దూసుకెళ్తోంది. ఇందులో లేడీ విలన్ జ్యోత్స్నగా గాయత్రి సింహాద్రి తన యాక్టింగ్ తో సత్తాచాటుతోంది. కన్నింగ్ నటనతో అదరగొడుతోంది. బయట ఇన్ స్టాగ్రామ్ లోనేమో గ్లామర్ షోతో రెచ్చగొడుతోంది ఈ భామ.

కార్తీక దీపం 2 సీరియల్ లో విలన్ జ్యోత్స్న గురించి సీరియల్ లవర్స్ అందరికీ పరిచయమే. ఆమె అసలు పేరు గాయత్రి సింహాద్రి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తరచూ పోస్టులు పెడుతుంటుంది. గ్లామర్ షో వీడియోలతో అలరిస్తుంటుంది. తాజాగా గాయత్రి పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది.

గాయత్రి సింహాద్రి బ్లూ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది. డిఫరెంట్ పోజులతో కూడిన ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ భామ పోస్టు చ...