భారతదేశం, ఆగస్టు 5 -- ఏకాదశి తిథికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి నాడు విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. సనాతన ధర్మంలో ఏకాదశి శ్రీమహావిష్ణువు ఆరాధనకు అత్యంత పవిత్రమైనది. ఆషాఢ కృష్ణపక్ష కామిక ఏకాదశి ఈ ఏడాది ఆగస్టు 9, ఆదివారం నాడు వచ్చింది.

ఏకాదశి తిథి ప్రారంభం: ఆగస్టు 8, శనివారం మధ్యాహ్నం 1:59 గంటలకు

ఏకాదశి తిథి ముగింపు: ఆగస్టు 9, ఆదివారం ఉదయం 11:04 గంటలకు

ధార్మిక విశ్వాసాల ప్రకారం, ఏకాదశి నాడు శ్రీమహా విష్ణువును విధివిధానాలతో పూజించి ఉపవాసం ఉండడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. మహాలక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి కూడా వీలవుతుంది. ఆ రోజు చేసే శుభకార్యాలు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయని నమ్మకం. కామిక ఏకాదశి రోజు...