భారతదేశం, ఆగస్టు 6 -- ఆగస్టు 9న వచ్చే కామిక ఏకాదశి నాడు అద్భుతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది. ఈ అరుదైన యోగం వల్ల మిథునం, కన్య, మకర రాశుల వారికి ఆర్థికంగా ఎన్నడూ లేని లాభాలు, కెరీర్ లో అద్భుత విజయాలు సిద్ధిస్తాయి.

హిందూ సంప్రదాయంలో ఈ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్రమంలోనే ఆషాడ మాసంలో వచ్చే కృష్ణ పక్ష కామిక ఏకాదశి ఈసారి ఆగస్టు 9, ఆదివారం రోజున వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం దక్కుతుంది. అంతేకాదు, ఈ పవిత్ర దినాన ఆకాశంలో ఏర్పడుతున్న అరుదైన గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టనుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రుడు, కుజుడు (అంగారకుడు) ఒకే రాశిలో కలవడం వల్ల అత్యంత శక్తివంతమైన 'మహాలక్ష్మి రాజయోగం' ఏర్పడుతుంది. జాతకంలో ఈ రెండు గ్రహాలు రెండు, తొమ్మిది...