భారతదేశం, ఆగస్టు 10 -- సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. 'ది క్రో' (The Crow) ఓటీటీలో ఆడియన్స్ అలరించేందుకు రెడీ అయింది. హాలీవుడ్ నటుడు బిల్ స్కార్స్‌గార్డ్ 2024లో రెండు పూర్తిగా భిన్నమైన సినిమాలతో ఒక రోలర్‌కోస్టర్‌ను అనుభవించాడు. ఆస్కార్ నామినేటెడ్ నోస్ఫెరాటులో భయంకరమైన వాంపైర్‌గా నటించిన అతను.. ది క్రోలో మూడీ సూపర్ హీరోగా మారాడు. ఇప్పుడు ది క్రో ఓటీటీలోకి వచ్చేస్తోంది.

సూపర్‌నేచురల్, హారర్ సినిమాలను ఇష్టపడే ఇండియన్ అభిమానులను ఎంటర్ టైన్ చేసేందుకు 'ది క్రో' ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సూపర్‌ నేచురల్ థ్రిల్లర్ డ్రామా ఆగస్టు 14, 2025న లయన్స్‌గేట్ ప్లేలో మాత్రమే ప్రసారం కాబోతుంది. ఇది ఓటీటీప్లే ప్రీమియం ద్వారా అందుబాటులో ఉంటుంది.

1990ల ది క్రో సినిమా సిరీస్ లేటెస్ట్ పార్ట్ ఇది. ది క్రో: సాల్వేషన్, ది క్రో: వికెట్ ప్రేయర్ ...