భారతదేశం, ఆగస్టు 22 -- ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవ్వాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 10 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాణిపాకం ఆలయ ఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్‌ అండ్ బి, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖలకు చెందిన అధికారులకు కలెక్టర్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

ఆర్‌డీఓ, డీఎస్పీ, ఆలయ ఈఓల పర్యవేక్షణలో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. వైద్యులు, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, విద్యుత్, అగ...