భారతదేశం, మార్చి 17 -- సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. ఈ మేరకు ఆయనే క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో మెుదటి నుంచి కీలక నేతగా ఉన్నారు. అయితే రానురాను పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతూ వచ్చారు. ఇందుకు కారణం ఎమ్మెల్యే సంజయ్. కాంగ్రెస్ పార్టీ సంజయ్‌కి ప్రాధాన్యం ఇస్తుందని జీవన్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు.

తాజాగా ఇవి ఎక్కువ అయ్యాయి. చివరకు జీవన్ రెడ్డి పార్టీని వీడే పరిస్థితికి వచ్చారు. జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్‌గా పిలిచే జీవన్ రెడ్డి నివాస ప్రాంగణంలో సోమవారం సాయంత్రం ఆయన సన్నిహితులు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించారు.

జగిత్యాల జిల్లాలో పార్టీకి అంకితభావంతో ప...