Hyderabad, జూన్ 29 -- హీరో సిద్ధార్థ్ 40వ మూవీ '3 బీహెచ్‌కే'. ఈ సినిమాకు శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. పోస్టర్లు, టీజర్లు, పాటలతో 3 బీహెచ్‌కే సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మాతగా నిర్మించిన 3 బీహెచ్‌కే చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 3 బీహెచ్‌కే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

"నా వాల్యూని తెలుగు ప్రేక్షకులే మొదటగా చూశారు. ఎప్పుడు కూడా వారే గొప్ప ప్రేమని చూపించారు. అది ఎప్పటికి మారదు. మారకూడదు. ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్టోరీ. మీకు ట్రైలర్ నచ్చితే కచ్చితంగా వెళ్లండి. చాలా ప్రేమతో ఈ స...