భారతదేశం, ఏప్రిల్ 8 -- ములుగు జిల్లాలోని కర్రెగుట్టలు అంటే.. మావోయిస్టులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. కీలక నేతలు ఇక్కడ తలదాచుకునేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం బలగాల చేతుల్లోకి వచ్చేసింది. ప్రభుత్వం కూడా దీనిని ఎకో టూరిజం హబ్‌గా మార్చాలని భావిస్తోంది. మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిందని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. మావోయిస్టుల ఉనికి తెలంగాణలో లేదన్నారు.

అపారమైన అటవీ సంపదతో, సుందరమైన సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన కర్రెగుట్టల ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పర్యటించే పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించే లక్ష్యంతో పామునూరు ప్రత్యేక పోలీస్ అవుట్‌పోస్ట్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది.

పామునూరు ఆపరేటింగ్ బేస్ సమీపంలో ఇంటర్ ఏజెన్సీ కో-ఆర్డినేషన్ సెంటర్, పోలీస్ ఔట్ పోస్ట్ నిర్మాణానికి పోలీసు అధి...