Hyderabad, ఆగస్టు 19 -- కర్కాటకంలో శుక్ర సంచారం: గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. దీనితో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. శుక్రుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. శుక్ర సంచారం ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది.

సంపద, ప్రేమ, అందానికి ప్రతీక అయిన శుక్రుడు త్వరలో తన కదలికను మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం మిథునంలో సంచారం చేస్తున్న శుక్రుడు మరో రెండు రోజుల్లో రాశి మార్పు చేయనున్నాడు. పంచాంగం ప్రకారం ఆగస్టు 21న ఉదయం 01:25 గంటలకు శుక్రుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడిని కర్కాటక రాశి అధిపతిగా భావిస్తారు.

శుక్రుడు చంద్రుని రాశిలో సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి మంచి లాభాలు కలుగుతాయి. శుక్రుడు సెప్టెంబర్ 14 వరకు ఇదే రాశిలో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో కర్కాటక రా...