భారతదేశం, ఏప్రిల్ 16 -- జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతిని (గురువు) జ్ఞానం, సంపద, అదృష్టానికి కారకుడిగా భావిస్తారు. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న గురువు, జూన్ నెలలో కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు అత్యంత శక్తిమంతమైన 'గజకేసరి యోగం' ఉద్భవిస్తుంది. ఏనుగు (గజం), సింహం (కేసరి) కలిస్తే ఎంతటి శక్తి వస్తుందో.. ఈ యోగం వల్ల జాతకులకు అంతటి ధైర్యం, రాజభోగాలు లభిస్తాయని పండితులు చెబుతుంటారు. గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉంటాడు కాబట్టి, ఈ ప్రభావం మరింత బలంగా ఉండనుంది.

ఈ యోగం పట్టడం వల్ల కేవలం డబ్బు మాత్రమే కాదు, సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. భావోద్వేగపరంగా మీరు మరింత దృఢంగా మారుతారు. కెరీర్ పరంగా నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంద...