భారతదేశం, ఆగస్టు 7 -- 2023 సంవత్సరానికి గాను రీసెంట్ గా ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా నిలిచాడు. 'జవాన్' సినిమాకు గాను ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే నేషనల్ అవార్డుకు ఎంపికైన షారుక్ ఖాన్ పై నటుడు లిల్లీపుట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కమల్ హాసన్ కాలి ధూళికి కూడా షారుక్ సరిపోడని తీవ్రమైన కామెంట్లు చేశాడు.

2018లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. జీరో సినిమాలో మరుగుజ్జు మనిషి పాత్ర పోషించాడు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా ఫెయిల్యూర్ తో షారుక్ సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నాడు. అయితే 1989లో కమల్ హాసన్ 'అపూర్వ సగోధరార్గల్' సినిమాలో మరుగుజ్జు క్యారెక్టర్ చేశాడు. ఆ సినిమాలో కమల్ లా నటించాలని షారుక్ ఖాన్ కాపీ కొట్టేందుకు ప్రయత్నించాడని లిల్లీపుట్ పేర్కొన్నాడు. రెడ్ ఎఫ్ఎమ్ పాడ్ క...