భారతదేశం, ఏప్రిల్ 14 -- తొమ్మిది నెలలు మోసి, కని, పెంచి.. ప్రయోజకుడిని చేయాలనుకున్న ఆ తల్లికి, తన ప్రాణాలు తీసే యముడు తన కడుపునే పుడతాడని తెలియదు. లోకం నిద్రపోతున్న వేళ, ఇంట్లో ఉన్న కొడుకే కాలయముడిగా మారి కన్నతల్లిని ఆహుతి చేసిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలును ఉలిక్కిపడేలా చేసింది.

ఒంగోలు నగరంలోని వెంకట రమణమ్మ అనే వృద్ధురాలు తన పెద్ద కుమారుడు కిషోర్ బాబుతో కలిసి నివసిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున, ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ.. ఆ ఇంట్లో మాత్రం నిప్పుల్లో ఓ తల్లి మృతిచెందింది.

మాంసం దుకాణం నడుపుకొనే కిషోర్ బాబు, తల్లి గాఢనిద్రలో ఉండగా ఇంటికి నిప్పు పెట్టాడు. చూస్తుండగానే మంటలు ఎగిసిపడ్డాయి.. ఆ మంటల మధ్య ఆమె అరుపులు కూడా బయటకు రాకుండానే ఆ వృద్ధురాలు బూడిదైపోయింది.

మంటలు రావడం గమనించిన స్థానికులు పరుగున వచ్చి చూడగా, కిషోర్ బాబు ...