Hyderabad, జూన్ 26 -- మంచు విష్ణు కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా కన్నప్ప. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు వంటి స్టార్స్ నటించిన కన్నప్ప మూవీ జూన్ 27న అంటే రేపే థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కన్నప్పకు పోటీగా మరో మహాశివుడి భక్తి చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.

జూన్ 27న మరో శివుని చిత్రం విడుదల కానుంది. 'కన్నప్ప'తో పాటు మహాశివుడి బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న చిత్రం 'చంద్రేశ్వర'. 'అదృశ్య ఖడ్గం' అనేది ట్యాగ్‌లైన్. శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో డాక్టర్ రవీంద్ర చారి నిర్మించారు. సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా చేశారు.

చంద్రేశ్వర సినిమాకు జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వం వహించారు. ఆర్కియాలజీ సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్‌గా 'చంద్రేశ్వర...