Hyderabad, జూలై 21 -- విష్ణు మంచు లీడ్ రోల్లో.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్లు అతిథి పాత్రల్లో నటించిన సినిమా కన్నప్ప. గత నెల 27న థియేటర్లలో రిలీజైంది. తొలి రోజే మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. తర్వాత బాక్సాఫీస్ దగ్గర కుప్పకూలి డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పుడీ సినిమా ఈ వారమే ఓటీటీలోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

విష్ణు మంచు కథ అందించి, లీడ్ రోల్లో నటించిన కన్నప్ప మూవీ ఈ శుక్రవారం (జులై 25) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టనున్నట్లు ఓ బజ్ క్రియేటైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను పెద్ద మొత్తానికే ఈ ఓటీటీ దక్కించుకున్నట్లు తెలిసింది. అయితే ఆ మొత్తం ఎంత అన్నది మాత్రం వెల్లడి కాలేదు.

జూన్ 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెట్టేలా కనిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ...