Hyderabad, ఆగస్టు 26 -- కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ సూ ఫ్రమ్ సో (Su from So). ప్రముఖ నటుడు రాజ్ బి శెట్టి ప్రొడ్యూస్ చేసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఆరో వారం కూడా థియేటర్లలో దూసుకెళ్తూనే ఉంది. ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై బజ్ నెలకొంది.

రాజ్ బి శెట్టి నటించి, నిర్మించిన కన్నడ బ్లాక్ బస్టర్ కామెడీ సినిమా సూ ఫ్రమ్ సో ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. జెపి తుమినాడ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. ఆగస్టు 23, 24 వరకు కూడా 6వ వీకెండ్ లో బాగానే కలెక్షన్స్ రాబట్టింది. కానీ ఆగస్టు 25, సోమవారం నాడు మాత్రం దాని కలెక్షన్స్ చాలా పడిపోయి రూ.0.3 కోట్లకు పరిమితమైంది. దీంతో థియేట్రికల్ రన్ త్వరలో ముగియవచ్చని అని ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ను రా...