భారతదేశం, అక్టోబర్ 6 -- ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్​ మీడియ ఇన్​ఫ్లుయెంజర్లు.. 'కంటెంట్​' పేరుతో చిత్ర, విచిత్ర పనులు చేస్తున్నారు. వీటిల్లో కొన్ని వివాదాస్పదంగా కూడా మారుతున్నాయి. ఫ్రాన్స్​లో ఇలాంటి ఒక ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. కంటెంట్​ పేరుతో ఓ ఇన్​ఫ్లుయెంజర్​.. ప్రజలను సూదులతో పొడిచి, వారిని భయపెట్టాడు. చివరికి అక్కడి కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది!

ఫ్రాన్స్​లో నివాసముండే సదరు ఇన్​ఫ్లుయెంజర్​ పేరు ఇలాన్​ ఎం. అతనికి అమీనీ మొజిటో అని ఇంటర్నెట్​లో గుర్తింపు ఉంది. కాగా ఇటీవలే అతను ప్రజల మీద ఒక ప్రాంక్​ ప్లే చేశాడు. పారిస్​ వీధుల్లో మాస్కు వేసుకుని తిరుగుతూ, కనిపించిన వారి శరీరాల్లో సూదులు పొడిచి, ఏదో ఇంజెక్షన్​ ఇస్తున్నట్టు ప్రవర్తించాడు.

వాస్తవానికి ఆ సూదులు ఖాళీవి. వాటిల్లో ఎలాంటి ధ్రవాలు లేవు. కానీ ఆ విషయం తెలియని ప్రజలు ...