భారతదేశం, సెప్టెంబర్ 29 -- Hanuman Ansh: భారీ బడ్జెట్‌లు, వందల కోట్ల రెమ్యునరేషన్లు కాదు.. ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించేది కేవలం కంటెంట్, అసలైన కథలు మాత్రమేనని బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా తేల్చి చెప్పారు. ముంబైలోని గ్రాండ్ హయత్ వేదికగా జరిగిన ఫిక్కీ ఫ్రేమ్స్ 2026 (FICCI Frames 2026) ఈవెంట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో రీసెంట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'హనుమాన్ అంశ్', హాలీవుడ్ హారర్ మూవీ 'అబ్సెషన్' సినిమాల సక్సెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

స్టార్ పవర్ కంటే కంటెంట్ గొప్పదని చెప్పడానికి ఈ రెండు సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని ఆయుష్మాన్ అన్నారు. ప్రేక్షకులు ఓటీటీలు, రకరకాల ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ చూస్తున్న ఈ రోజుల్లో థియేటర్‌కి రావాలంటే కథలో సత్తా ఉండాలని స్పష్టం చేశారు.

విశాల్ చతుర్వేది...