Hyderabad, అక్టోబర్ 6 -- టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండకు కారు ప్రమాదం జరిగిన విషయం తెలుసు కదా. దీనిపై అతడు అధికారికంగా స్పందించాడు. సోమవారం (అక్టోబర్ 6) సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి సమీపంలో జరిగిన ఒక ప్రమాదం నుంచి ఈ నటుడు సురక్షితంగా బయటపడ్డాడు. దీనిపై విజయ్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించాడు. తాను బాగానే ఉన్నానని, అభిమానులు 'టెన్షన్ పడొద్దు' అని చెప్పాడు.

సోమవారం (అక్టోబర్ 6) సాయంత్రం విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురయ్యాడని తెలియగానే అభిమానులు ఆందోళన చెందారు. దీంతో అతడు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎక్స్ ద్వారా స్పందించాడు. "అంతా బాగానే ఉంది. కారుకు ప్రమాదం జరిగింది. కానీ మేమంతా బాగానే ఉన్నాము. వెళ్లి ఒక స్ట్రెంగ్త్ వర్కౌట్ కూడా చేశాను. ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాను.

నా తల కొంచెం నొప్పిగా ఉంద...