Hyderabad, జూలై 5 -- ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌ వస్తూనే ఉంటోంది. ఎప్పటికప్పుడు ప్రతివారం డిఫరెంట్ జోనర్లలో ఓటీటీ సినిమాలను వివిధ ప్లాట్‌ఫామ్స్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ఓటీటీ ఆడియెన్స్ ఆదరణ పొందుతుంటాయి. అయితే, వీటిలో థియేట్రికల్ రిలీజ్ తర్వాత కాకుండా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు సైతం ఉన్నాయి.

అలాంటి వాటిలో ఒకటే ది ఓల్డ్ గార్డ్. 2020లో అమెరికన్ సూపర్ హీరో అడ్వెంచర్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది ఈ ది ఓల్డ్ గార్డ్ సినిమా. 2020 జులై 10న డైరెక్ట్‌గా ది ఓల్డ్ గార్డ్ ఓటీటీ రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.7 రేటింగ్ సాధించగా.. 80 శాతం వరకు ఫ్రెష్ కంటెంట్‌గా పేరు తెచ్చుకుంది.

అలాంటి ది ఓల్డ్ గార్డ్ మూవీకి సీక్వెల్‌గా ఐదేళ్ల తర్వాత వచ్చిన సినిమానే ది ఓల్డ్ గార్డ్ 2. అదే సూపర్...