Hyderabad, జూన్ 29 -- ఓటీటీలోకి ప్రతి రోజు ఏదో ఒక సినిమా రావడం, వాటిలో కొన్ని ట్రెండింగ్‌లో దూసుకెళ్లడం సాధారణంగా జరిగే విషయమే. అయితే, మంచి కంటెంట్ ఉన్నప్పటికీ థియేటర్లలో ఆడియెన్స్ ఆదరణ నోచుకోని, బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ అందుకోని సినిమాలు ఎన్నో ఉన్నాయి.

అలాంటి మూవీస్‌కు ఓటీటీలు మంచి ప్లాట్‌ఫామ్స్‌గా ఉంటున్నాయి. థియేటర్లలో దక్కని రెస్పాన్స్‌ను ఓటీటీల్లో సంపాదించుకుంటున్నాయి. అయితే, ఓటీటీ రిలీజ్, ఓటీటీ ట్రెండింగ్ ఇప్పుడు చాలా సాధారణమైనప్పటికీ అందరి దృష్టిని ఒక సినిమా ఆకర్షిస్తుందంటే ఏదో ఒక మంచి కారణం ఉండే ఉంటుంది.

అలా ఒక మంచి చిత్రంగా ఓటీటీలో దూసుకుపోతోన్న మూవీనే 23 (ఇరవై మూడు). ఏ ఏడాది థియేటర్లలో మే 16న థియేటర్లలో విడుదలైన 23 మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. మంచి కంటెంట్, కాన్సెప్ట్, సోషల్ డ్రామా, సామాజిక అవగాహన వంటి అంశాలు ఉన్నాయని...