Hyderabad, ఆగస్టు 25 -- ఓటీటీల్లో ప్రతి వారం ఎక్కువ వ్యూస్ సంపాదించిన వెబ్ సిరీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈవారం కూడా ఆ జాబితా వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్న వెబ్ సిరీస్ లకు ఈ జాబితాలో చోటు దక్కింది.

ఓటీటీల్లో గత వారం అంటే ఆగస్టు 18 నుంచి 24 వరకు ఎక్కువ వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ గా సారే జహాన్ సే అచ్చా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కు గత వారం 2.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్. పాకిస్థాన్ లోని ఓ ఇండియన్ గూఢచారి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ప్రతీక్ గాంధీ లీడ్ రోల్లో నటించాడు.

నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతున్న హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వెన్స్‌డే స...