Hyderabad, ఆగస్టు 25 -- ఆర్మాక్స్ మీడియా ప్రతి వారం ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. గత వారం అంటే ఆగస్టు 18 నుంచి 24 మధ్య వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాల లిస్ట్ వచ్చేసింది. ఇందులో హరి హర వీరమల్లు సత్తా చాటుతోంది.

ఆర్మాక్స్ మీడియా ప్రతి వారం ఇండియాలో అత్యధిక వ్యూస్ సాధించిన మూవీస్ లిస్టును రిలీజ్ చేస్తోంది. కనీసం 30 నిమిషాల పాటు చూసిన సినిమాలకు వీటిలో చోటు దక్కుతుంది. అలా గత వారం చూసుకుంటే ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అవుతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు మూవీ తొలి స్థానంలో ఉంది.

ఈ మూవీకి ఐదు రోజుల్లోనే 3.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆగస్టు 20 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా ప...