Hyderabad, జూలై 29 -- మలయాళ నటుడు అర్జున్ అశోకన్ నెక్ట్స్ మూవీ 'సుమతి వలవు' శుక్రవారం (ఆగస్టు 1) థియేటర్లలోకి రానుంది. ఈ హారర్ కామెడీ కేరళలోని తిరువనంతపురం జిల్లాలో సుమతి వలవు గురించి ఒక భయంకరమైన జానపద కథ ఆధారంగా రూపొందింది. ఈ సినిమాను చూసే ముందు మీరు తప్పక చూడాల్సిన టాప్ మలయాళ హారర్ కామెడీల జాబితాను మేము అందిస్తున్నాం. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్న ఈ మూవీస్ ను కేవలం ఓటీటీప్లే (OTTPlay) ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తోనూ చూడొచ్చు.

ప్రేతమ్ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో ఉంది. ముగ్గురు స్నేహితులు ఒక రిసార్ట్‌ను ప్రారంభిస్తారు. అక్కడ వారికి పారానార్మల్ కార్యకలాపాలు కనిపిస్తాయి. ఈ సంఘటనలు వారిని మెంటలిస్ట్ జాన్ డాన్ బోస్కో దగ్గరికి తీసుకెళ్తాయి. ఆ రిసార్ట్‌కు ఒక దెయ్యం పట్టిందని, అది తన మరణానికి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందని వారు తెలుసుకు...