భారతదేశం, డిసెంబర్ 15 -- ఈ ఏడాది చివరికి వచ్చేశాం. 2025లో ఓటీటీలో అద్భుతమైన వెబ్ సిరీస్‌లు అలరించాయి. హారర్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని జానర్లలో ఆకట్టుకున్న 2025 బెస్ట్ వెబ్ సిరీస్‌ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మరో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేలోపు, 2025లో మనల్ని మెస్మరైజ్ చేసిన, తప్పక చూడాల్సిన హిందీ వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇక్కడ చూడండి.

దేశంలోని మొట్టమొదటి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ (ఘోస్ట్ హంటర్) గౌరవ్ తివారీ వాస్తవ జీవితం ఆధారంగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ఇది. గౌరవ్ అనుమానాస్పద మృతి వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే జర్నలిస్ట్‌గా కల్కి కోచ్లిన్, గౌరవ్‌గా కరణ్ టాకర్ నటించారు. ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా చూడొచ్చు.

బాలీవుడ్ నటుడు కునాల్ ఖేము నటించిన హార్ట్ టచింగ్ కామెడీ డ్రామా. బాధ్యత లేని భర్త అని భార్య వదిలేస్తే.. తాను ఎంత బాధ...