భారతదేశం, ఆగస్టు 23 -- ఓటీటీలోకి హాలీవుడ్ థ్రిల్లర్ దూసుకొచ్చింది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన బ్రాడ్ పిట్ మూవీ 'ఎఫ్1' (F1) డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. ఈ హాలీవుడ్ రేసింగ్ థ్రిల్లర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో చూద్దాం.

ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో విడుదలైన ఎఫ్1 మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రేసింగ్ చిత్రాన్ని మీరు ఇంటి నుంచే చూడవచ్చు. 4K అల్ట్రా హెచ్డీలో అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ఓటీటీలోకి ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. అయితే నేరుగా చూసే అవకాశం లేదు. ఈ మూవీని రెంట్ తీసుకోవచ్చు లేదంటే కొనుక్కోవాలి.

ఎఫ్ 1 మూవీని ఓటీటీలో $19.99కు రెంట్ కు తీసుకోవచ్చు లేదా $24.99కు కొనుగోలు చేయవచ్చు. ఎఫ్1 సినిమాను యాపిల్ ఒరిజినల్ ఫిల్మ్స్ తయారు చేసినందున, హోమ్ వీడియోలో విడుదల కావడ...