Hyderabad, జూన్ 26 -- ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరిస్తుంటాయి. అయితే, అవి ఎలాంటి జోనర్ అయిన తెరకెక్కించే విధానం సరికొత్తగా ఉంటే వాటికి మంచి ఆదరణ లభిస్తుంది. అలా ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ ఏక్ థీ బేగం.

బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఏక్ థీ బేగం రెండు సీజన్స్‌తో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌కు సచిన్ దారేకర్, జై తంక్ దర్శకత్వం వహించారు. సప్న దిది అనే నవల ఆధారంగా ఏక్ థీ బేగంను సచిన్ దారేకర్ రచించారు. ఈ సిరీస్‌లో అనూజ సాథే, అంకిత్ మోహన్, చిన్మయి మండ్లేకర్, రాజేంద్ర శిసాట్కర్, అభ్‌జీత్ చావన్ కీలక పాత్రలు పోషించారు.

శృంగార సన్నివేశాలు, యాక్షన్, వయోలెన్స్, లవ్ స్టోరీ, రొమాంటిక్ సీన్లతో ఏక్ థీ బేగం వెబ్ సిరీస్‌ను మలిచారు. నిజానికి ఇది ఒక మరాఠీ సిరీస్. కథ అంతా ముంబైలో జరుగుతు...