Hyderabad, జూలై 17 -- ఓటీటీలోకి కొన్ని చిన్న సినిమాలు నేరుగా వస్తున్నాయి. కానీ ఇవి మన మనసుపై చెరగని ముద్ర వేస్తున్నాయి. అలాంటి సినిమానే జీ5 ఓటీటీలో వచ్చి కాళీధర్ లాపతా (Kaalidhar Laapata). 2019లో వచ్చిన తమిళ సినిమా కే.డీ సినిమాకు ఇది రీమేక్. రోజురోజుకీ పతనమవుతున్న కుటుంబ బంధాలు, మానవ సంబంధాల చుట్టూ తిరిగే ఈ సినిమా ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది.

జీ5 ఓటీటీలోకి జులై 4న నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమా కాళీధర్ లాపతా. అంటే కాళీధర్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడని అర్థం. ఈ సినిమాలో కాళిధర్ పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించాడు. మతిమరుపుతో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి ఈ కాళిధర్. అతని పేరు మీద ఉన్న ఆస్తులను హాస్పిటల్ బెడ్ పై అచేతనంగా ఉన్న సమయంలో వేలి ముద్ర తీసుకొని తమ పేరిట రాయించుకునే సొంత తమ్ముళ్లు.. తర్వాత కాళిధర్ ను వదిలించుకోవాలన...