Hyderabad, జూన్ 22 -- ఓటీటీలో ఎన్నో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, వాటిలో కొన్ని మూవీస్ మాత్రమే ఓటీటీ ఆడియెన్స్ ఆదరణ పొందుతాయి. అలాగే, కంటెంట్ ఉండి కూడా థియేటర్లలో అంతగా గుర్తింపు తెచ్చుకోలేని సినిమాలు ఓటీటీలో దుమ్ముదులుపుతుంటాయి.

అలాంటి సినిమానే చౌర్య పాఠం. తెలుగులో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీగా వచ్చిన చౌర్య పాఠం ఓటీటీలో దూసుకుపోతోంది. నలుగురు క్రిమినల్స్ ప్రశాంతమైన గ్రామంలో బ్యాంక్ దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది ఈ సినిమా.

ఈ విలేజ్‌లో బ్యాంక్ రాబరీ చేయడానికి ఈ చిన్న ముఠా చేసే ప్రయత్నాలు, ఎదురయ్యే సమస్యలు కామెడీతో ఎంటర్‌టైనింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా చూపించారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైన చౌర్య పాఠంపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ పెద్దగా ఆశించిన ఫలితం అందుకోలేకపోయిం...