Hyderabad, జూలై 21 -- అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి గత వారమే అడుగుపెట్టిన తెలుగు థ్రిల్లర్ మూవీ కుబేర (Kuberaa). గత శుక్రవారం (జులై 18) ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. వచ్చీ రాగానే సత్తా చాటుతోంది. ప్రైమ్ వీడియోలో తొలి రెండు స్థానాల్లోనూ ఈ సినిమానే నిలవడం విశేషం.

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నాలాంటి వాళ్లు నటించిన మూవీ కుబేర. జూన్ 20న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.132 కోట్లు వసూలు చేసిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీకి ఓటీటీలోనూ అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ మూవీగా నిలిచింది.

తెలుగు వెర్షన్ తొలి స్థానంలో, తమిళ వెర్షన్ రెండోస్థానంలో ఉండటం విశేషం. సుమారు మూడు గంటల నిడివితో ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర తమిళ ...