భారతదేశం, ఆగస్టు 16 -- ఓటీటీలో లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మయసభ అదరగొడుతోంది. సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ తెలుగు సిరీస్ సత్తాచాటుతోంది. ఆగస్టు 7న స్ట్రీమింగ్ కు వచ్చినప్పటి నుంచి వ్యూస్ లో దూసుకెళ్తోంది. దేవ కట్టా దర్శకత్వం వహించిన మయసభ సిరీస్ ను.. ఆంధ్ర రాజకీయ దిగ్గజాలైన నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితాల ఆధారంగా రూపొందించారు. తొమ్మిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో టాప్ టెన్ జాబితాలో ట్రెండింగ్‌లో ఉంది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.

చైతన్య రావు, ఆది పినిశెట్టి ఈ మయసభ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. వైఎస్సార్, సీబీఎన్ క్యారెక్టర్లు ప్లే చేశారు. వీళ్లిద్దరు తమ నటనతో అదరగొట్టారు. అయినప్పటికీ సీనియర్ నటుడు సాయి కుమార్ నటన ఈ సిరీస్‌కు మరింత వన్నె తెచ్చింది. మయసభ చూసిన వారందరూ ...