Hyderabad, జూన్ 23 -- ఓటీటీలో ఈ వారం తెలుగు భాషలో ది బెస్ట్ 8 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్, రొమాంటిక్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సైన్స్ ఫిక్షన్ ఇలా ఒక్కోటి ఒక్కో రకంగా డిఫరెంట్ జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ తెలుగు సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

కన్నడలో తెరకెక్కిన కోర్ట్ రూమ్ డ్రామా లీగల్ థ్రిల్లర్ సినిమా యుద్ధకాండ చాప్టర్ 2. జూన్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో యుద్ధకాండ చాప్టర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది.

తెలుగులో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా ఘటికాచలం. నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో బాల నటుడు నిఖిల్ దేవాదుల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. జూన్ 20 నుంచి అమెజాన్...