భారతదేశం, సెప్టెంబర్ 27 -- స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లేటెస్ట్ క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ ఘాటి ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక్క రోజులోనే ఈ సినిమా ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేస్ కు దూసుకెళ్లింది. గంజాయి స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సాగే ఈ మూవీలో ఘాటిల కోసం పోరాడే క్యారెక్టర్ లో హీరోయిన్ అనుష్క నటించింది.

అనుష్క కొత్త మూవీ ఘాటి ఓటీటీలో సత్తాచాటుతోంది. ఈ రివేంజ్ థ్రిల్లర్ ఓటీటీ ట్రెండింగ్ నంబర్ వన్ లోకి దూసుకొచ్చింది. ఘాటి సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 26)న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇప్పుడు ఒక్క రోజులోనే అంటే శనివారం ప్రైమ్ వీడియో ఇండియన్ నంబర్ వన్ మూవీగా ఘాటి ట్రెండ్ అవుతోంది.

ఘాటి మూవీ నిన్న ఓటీటీలోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ...