భారతదేశం, నవంబర్ 3 -- ఓటీటీలోకి వచ్చీ రాగానే మలయాళం సూపర్ హీరో మూవీ, కన్నడ యాక్షన్ డ్రామా చెలరేగిపోతున్నాయి. మూడు రోజుల్లోనే టాప్ 5 సినిమాల జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. వీటిని నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు. మరి టాప్ 5లో ఉన్న సినిమాలేంటో చూడండి.

మలయాళం ఫిమేల్ సూపర్ హీరో మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. గత శుక్రవారం (అక్టోబర్ 31) జియోహాట్‌స్టార్ లోకి వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 3.8 మిలియన్ల వ్యూస్ తో తొలి స్థానంలో నిలిచింది. ఏడు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ లీడ్ రోల్స్ లో నటించారు.

ఇక గత శుక్రవారమే ఓటీటీలోకి వచ్చిన కన్నడ యాక్షన్ డ్రామా మూవీ కాంతార ఛాప్టర్ 1 రెండో స్థానంలో ఉంద...