భారతదేశం, డిసెంబర్ 22 -- 2025 సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలోనూ హారర్ సినిమాల హవా నడిచింది. 'సినర్స్' నుంచి మలయాళ చిత్రం 'డియస్ ఇరే' వరకు ప్రేక్షకులను భయపెట్టిన టాప్ 10 హారర్ సినిమాల జాబితా (IMDb రేటింగ్స్ ఆధారంగా) ఇక్కడ చూడండి.

మరికొన్ని రోజుల్లో 2025కి గుడ్ బై చెప్పబోతున్నాం. కానీ ఈ ఏడాదిని హారర్ మూవీ లవర్స్ అంత త్వరగా మర్చిపోలేరు. ఎందుకంటే థ్రిల్, భయం, ఉత్కంఠ రేకెత్తించే అనేక సినిమాలు ఈ ఏడాది అలరించాయి. ఐఎండీబీ (IMDb)లో అధిక రేటింగ్ సంపాదించిన టాప్ 10 హారర్ సినిమాలు, అవి స్ట్రీమింగ్ అవుతున్న ప్లాట్‌ఫామ్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ప్లాట్‌ఫామ్: జియో హాట్‌స్టార్ (JioHotstar)

రేటింగ్: 7.6

కొన్నేళ్ల తర్వాత తమ సొంత ఊరికి తిరిగి వచ్చిన ఇద్దరు కవల సోదరుల కథ ఇది. అక్కడ ఒక దుష్టశక్తి వారి కోసం కాచుకుని ఉంటు...