భారతదేశం, ఫిబ్రవరి 18 -- ఈవారం ఓటీటీ ప్రియులకు వినోదాల విందు దొరకనుంది. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5, సన్ నెక్ట్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. 'లక్కీ ది సూపర్ స్టార్' నుంచి మమ్ముట్టి 'చాతా పాచా' వరకు ఈ వారం విడుదలయ్యే సినిమాల వివరాలు ఇక్కడ చూడండి.

ఈ వారం సౌత్ ఇండియన్ సినిమాల ఓటీటీ రిలీజ్ లైనప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫిబ్రవరి 19 (గురువారం) నుంచే కొత్త సినిమాలు అందుబాటులోకి రానున్నాయి.

రిలీజ్ తేదీ: ఫిబ్రవరి 19

తెలుగు సినిమా శ్రీ చిదంబరం గారు ఓటీటీలోకి వస్తోంది. ఒక యువకుడు తన గతం తాలూకు అవమానంతో, వేరే పేరుతో బతుకుతుంటాడు. ప్రేమ, బాధ, ధైర్యం ద్వారా తన నిజమైన అస్తిత్వాన్ని ఎలా తెలుసుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. తులసి, వంశీ తుమ్మల ప్రధాన ...