భారతదేశం, జూలై 30 -- వచ్చే నెల ఆగస్టులో జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. హైప్రొఫైల్ హాలీవుడ్ చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఇందులో సైకలాజికల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, కామెడీ డ్రామా తదితర జోనర్ల సినిమాలున్నాయి. మరి ఇందులో ముఖ్యమైన సినిమాలపై ఓ లుక్కేద్దాం.

ఆగస్టు 7 నుంచి సైన్స్ ఫిక్షన్ సినిమా మిక్కీ 17 ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. జియోహాట్‌స్టార్‌ లో డిజిటల్ బాట పట్టనుంది. అకాడమీ అవార్డు గెలుచుకున్న దర్శకుడు బాంగ్ జూన్ హో రచించి, దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ బ్లాక్ కామెడీ చిత్రం మిక్కీ 17. ఎడ్వర్డ్ ఆష్టన్ 2022 పుస్తకం మిక్కీ 7 ఆధారంగా రూపొందిన మూవీలో రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో స్టీవెన్ యున్, టోనీ కొలెట్, మార్క్ రఫాలో, నవోమి ఆకీ కూడా నటించారు. మిక్...