భారతదేశం, ఆగస్టు 22 -- బాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'మా' (Maa) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో రిలీజైన దాదాపు రెండు నెలల్లో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఇవాళ (ఆగస్టు 22) ఓటీటీలో రిలీజైంది ఈ మూవీ. విశాల్ ఫూరియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం కాజోల్ కెరీర్ లో ఆమె నటించిన తొలి హారర్ మూవీ. థియేటర్లో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

థియేటర్లో అదరగొట్టిన హారర్ థ్రిల్లర్ 'మా' సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది. ఇప్పుడైతే హిందీలో అందుబాటులో ఉంది. ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చింది. ఇందులో కాజోల్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఆమె భర్త అజయ్ దేవగణ్ తో పాటు జ్యోతి దేశ్ పాండే, కుమార్ మంగాట్ పాఠక్ ఈ మూవీని నిర్మించారు.

కాజోల్ తన కెరీర్ లో నటించ...