భారతదేశం, సెప్టెంబర్ 27 -- ఈ వారం కూడా ఓటీటీలో ఫ్రెష్ కంటెంట్ వచ్చింది. చాలా సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని స్పెషల్ గా ఉన్నాయి. ఈ వీకెండ్ లో ఓటీటీలో చూసేందుకు ఇవి బెస్ట్. ఇందులో మిస్టరీ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ తదితర జోనర్ల సినిమాలు, సిరీస్ లున్నాయి.

ఓటీటీ విడుదల తేదీ: సెప్టెంబర్ 26

ఓటీటీ ప్లాట్ ఫామ్: నెట్‌ఫ్లిక్స్‌

అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన కామెడీ చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2. థియేట్రికల్ విడుదలైన దాదాపు 2 నెలల తర్వాత ఓటీటీలోకి ప్రవేశించింది. 2012 హిట్ సన్ ఆఫ్ సర్దార్ కు సీక్వెల్ ఇది.

ఓటీటీ రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 26

ఓటీటీ ప్లాట్ ఫామ్ : జియోహాట్‌స్టార్‌

రొమాంటిక్ డ్రామా హృదయపూర్వం మోహన్ లాల్ పోషించిన సందీప్ బాలకృష్ణన్ అనే ధనవంతుడి పాత్ర చుట్టూ తిరుగుతుంద...