భారతదేశం, ఫిబ్రవరి 10 -- మాస్ మహారాజా రవితేజ నటించిన సంక్రాంతి మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఓటీటీ రిలీజ్ లో మార్పు జరిగింది. ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 13న రావాల్సిన ఈ సినిమా.. మెగాస్టార్ చిరంజీవి సినిమా కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. జీ5 (ZEE5)లో ఈ సినిమా ఎప్పుడు రానుందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

సంక్రాంతి 2026 కానుకగా జనవరి 13న విడుదలైన రవితేజ మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (Bhartha Mahasayulaku Wignyapthi). కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించుకుంది. రవితేజ తన మాస్ ఇమేజ్ పక్కనపెట్టి చేసిన ఈ సినిమా ఓ రకంగా అతని డిజాస్టర్లకు బ్రేక్ వేసింది. కానీ ఆశించిన విజయం మాత్రం ఇవ్వలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్.

ముందుగా అనుకున్...