భారతదేశం, సెప్టెంబర్ 28 -- ఓటీటీలోకి ఇవాళ ఓ మంచి సినిమా వచ్చేసింది. బిడ్డల కోసం తల్లి త్యాగం, అమ్మ కోసం మారే తనయుడి కథతో తెరకెక్కిన 'నమ్మకం' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. ఆదివారం (సెప్టెంబర్ 28) నుంచి ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆడియన్స్ మనసులను హత్తుకుంటోంది. ఈ మూవీకి దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు ప్రొడ్యూసర్ కావడం విశేషం.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ వరుసగా మంచి సినిమాలు, సిరీస్ లతో డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. దీంతో పాటు ప్రతి ఆదివారం కథాసుధలో భాగంగా ఓ చిన్న సినిమాను రిలీజ్ చేస్తోంది. డిఫరెంట్ జోనర్లలో, విభిన్న కథలతో ప్రతి సండే ఒక్కో షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేస్తోంది ఈటీవీ విన్. ఇందులో భాగంగానే ఈ ఆదివారం 'నమ్మకం' అనే చిన్న సినిమా ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది.

ది...