భారతదేశం, ఆగస్టు 12 -- పవన్ కల్యాణ్ లేెటెస్ట్ పీరియడికల్ డ్రామా 'హరి హర వీరమల్లు' సినిమాను ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వాయిదా పడినట్లు తెలిసింది. అందుకు కారణం రజనీకాంత్ మేనియానే అని టాక్. రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుండటంతో హరి హర వీరమల్లు ఓటీటీ విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం.

రాజకీయ నాయకుడిగా మారిన నటుడు పవన్ కల్యాణ్ చిత్రం 'హరి హర వీర మల్లు: పార్ట్ 1 -- స్వోర్డ్ vs స్పిరిట్' ఓటీటీ రిలీజ్ వాయిదా పడ్డట్లు తెలిసింది. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ వీక్ తర్వాత కలెక్షన్లు పడిపోయాయి. ఈ చిత్రం త్వరలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కానుంది. డిజిటల్ హక్కులను ప్రైమ్ వీ...