Hyderabad, జూలై 7 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు విభిన్నమైన జోనర్స్‌లో డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ప్రతివారం సరికొత్త కథనాలతో ఓటీటీ సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతుంటాయి. అలా, ఈ వారం కూడా ఓ స్పెషల్ మూవీ అలరించేందుకు సిద్ధంగా ఉంది.

ఆ సినిమానే జియామ్. ఇది ఒక సర్వైవల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అయితే, ఇది ఒక జాంబీ కాన్సెప్ట్ సినిమా. ఒక వైరస్ వల్ల మనుషులు మరో మనిషిని కిరాతకంగా చంపి తింటారు. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు ఎన్నో ఓటీటీ సినిమాలు, ఓటీటీ సిరీస్‌లు కుప్పలుతెప్పలుగా వచ్చాయి.

వీటిలో స్టోరీ అన్నింట్లో లాగే సాధారణంగా ఉంటుంది. ఒక అవుట్ బ్రేక్ జరగడం (వైరస్ స్ప్రెడ్ అవడం), దాని నుంచి హీరో లేదా కుటుంబం, తనకు సంబంధించిన వాళ్లను కాపాడుకోవడం వంటి సీన్లతోనే కథ సాగుతుంది. అయితే, వాటిని ఎంత థ్రిల్లింగ్, హారర్, సర్...