భారతదేశం, సెప్టెంబర్ 26 -- ఓటీటీలోకి తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'మదరాసి' రాబోతోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఇవాళ (సెప్టెంబర్ 26) అనౌన్స్ చేశారు. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన మదరాసి సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. దీనికి టాప్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు.

లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ మదరాసి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ శుక్రవారం రివీలైంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది.

శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది. ఇందులో మదరాసి హీరో శ...