భారతదేశం, ఆగస్టు 17 -- బాక్సాఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ తో క్రమంగా కలెక్షన్లు సాధిస్తున్న మల్టీ స్టారర్ 'వార్ 2' (war 2) ఓటీటీ రిలీజ్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందు ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైంది వార్ 2. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కు హిందీలో ఇదే ఫస్ట్ సినిమా. బాలీవుడ్ డెబ్యూలో తారక్ అదరగొట్టాడు.

యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వార్ 2 ఆరో భాగం. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ ఆఫ్ కు మిశ్రమ సమీక్షలు వచ్చాయి. ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై బజ్ వినిపిస్తోంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వచ్చిన వార్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుందని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్...